తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం నిజమే : నిగ్గుతేల్చిన విచారణ కమిటి

తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 04:10 AM IST
తిరుమల శ్రీవారి ఆభరణాల మాయం నిజమే : నిగ్గుతేల్చిన విచారణ కమిటి

Updated On : January 10, 2020 / 4:10 AM IST

తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది.

తిరుమలలో అప్పట్లో కలకలం రేపిన శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం.. వాస్తవమేనని విచారణ కమిటి తేల్చింది. పునఃపరిశీలనలోను ఆ నగలు కనిపించలేదని తెలిపింది. ట్రెజరీ నుంచే నగలు మాయమయ్యాయని తేల్చి చెప్పింది. దీంతో అప్పటి ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులపై శాఖాపరమైన చర్యలకు టీటీడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

2016లో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానంలో స్వామి వారి విలువైన ఆభ‌ర‌ణాల‌ను బ‌య‌ట‌కు వెళ్లాయి. 5కిలోల వెండి కిరీటం, గోల్డ్ నాణాలు, రెండు ఉంగరాలు, నెక్లెస్ మాయమయ్యాయి. వీటివిలువ 7లక్షల 36 వేల పైనే ఉంటుందని కమిటి తేల్చింది. అప్పటి ట్రెజరీ ఏఈవో శ్రీనివాసులపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. 

శ్రీనివాసులను బాధ్యుడిగా పేర్కొంటూ 2018 నవంబర్ నుంచి అతని నుంచి రూ.25వేలు కట్ చేస్తూ వస్తున్నారు. నగలు మాయమవ్వడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, మరో సారి పరిశీలించాలని శ్రీనివాస్ ఆరు నెలల క్రితం ఉన్నతాధికారులను కోరారు.

టీటీడీ సెప్టెంబరులో పరిశీలన ప్రారంభించి… ఇటీవల పూర్తి చేసింది. ఈ పరిశీలనలో మాయమైన ఆభరణాలు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఏఈవో శ్రీనివాసులు నుంచి జరిమానా వసూలును కొనసాగిస్తూనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.