ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : కౌలుదారులకు పెట్టుబడి సాయం

ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 12:56 PM IST
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : కౌలుదారులకు పెట్టుబడి సాయం

ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం కౌలుదారులకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం (నవంబర్ 19, 2019) మంత్రి ప్రకటించారు. దేశంలోనే తొలిసారి కౌలుదారులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. దీంతో 45 లక్షల రైతు కుంటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు.

దేవాదాయ భూముల కౌలు రైతులకు పెట్టుబడి సాయం వర్తింపు వర్తిస్తుందన్నారు. దేవాదాయ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం పెట్టుబడి సాయం అర్హత ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. 1.20 లక్షల రైతుల వివరాలు ఆర్టీజీఎస్ కు పంపినట్లు తెలిపారు. కౌలు రైతుల జాబితాను సచివాలయంలో అంటిస్తామని చెప్పారు. నవంబర్ 25 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వేరుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రూ.3 వేల కోట్లతో మార్కెట్ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. టమాట, సుబాబుల్, మొక్కజొన్న, ఉల్లి రైతులను ఆదుకున్నామన్నారు. ధరల స్థిరీకరణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పంటల ధరలపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో మొక్కజొన్న రైతులకు సబ్సిడీ ఇస్తామని టీడీపీ మోసం చేసిందన్నారు.