IPL 2018 టాప్ 5 బ్యాట్స్‌మెన్ వీళ్లే..

IPL 2018 భారీ అంచనాల మధ్య.. తీవ్రమైన ఉత్కంఠతో సాగింది. అంచనాలకు మించి రాణించారు ప్లేయర్లు. మ్యాచ్ జయాపజయాలు అటుంచి బ్యాట్స్‌మెన్ పోరాటం లీగ్‌కే హైలెట్‌గా నిలిచేలా చేసింది. డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ వివాదంతో జట్టుకు దూరమవడంతో సన్‌రైజర్స్ పగ్గాలను అందుకున్న విలియమ్సన్ అనూహ్యంగా జట్టును ఫైనల్ వరకూ నడిపించి ఔరా అనిపించుకున్నాడు.
మరో వైపు రెండేళ్ల నిషేదం తర్వాత బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజేతగా నిలిచి సత్తా చాటింది. ఈ పొట్టి లీగ్‌లో దూకుడు కనబరిచిన టాప్ 5 బ్యాట్స్‌మెన్ జాబితాను పరిశీలిస్తే..
Read Also : IPL ఆరంభం నుంచి టాప్ 5గా నిలిచిన ప్లేయర్లు ఎవరంటే..
షేన్ వాట్సన్: 5
పదేళ్ల తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై జట్టు అంతా 30 ప్లస్ ఆటగాళ్లనే తీసుకుంది. గెలవడం అనుమానమేనంటూ సోషల్ మీడియాలో విమర్శలు కురిపించిన వారందరికీ ఓపెనర్‌గా దిగి గట్టి బదులిచ్చాడు. మొత్తంగా 555(44 ఫోర్లు, 35 సిక్సులు)తో టాప్ 5 స్థానాన్ని దక్కించుకున్నాడు.
అంబటి రాయుడు: 4
వేలంలో ముంబై ఇండియన్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు చేరిన ప్లేయర్ అంబటి.. టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్‌లో తన సత్తాను చాటాడు. ఫలితంగా ఒక సీజన్లో 602(53 ఫోర్లు, 34 సిక్సులు)తో టాప్ 4 స్థానంలో నిలిచాడు.
కేఎల్ రాహుల్: 3
అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రదర్శన ఎలా ఉన్నా.. ఐపీఎల్‌లో మాత్రం దూకుడు తగ్గని ప్లేయర్ కేఎల్ రాహుల్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడి 659(66 ఫోర్లు, 32 సిక్సులు)తో టాప్ 3 స్థానంలో నిలిచాడు. రాహుల్ 2018 సీజన్ మొత్తంలో 6 హాఫ్ సెంచరీలు చేయగలిగాడు.
రిషబ్ పంత్: 2
అంచనాలే లేని ప్లేయర్.. తొలి సారి ఐపీఎల్ లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడి 684(68 ఫోర్లు, 37 సిక్సులు) పరుగులతో టాప్ 2 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది.
కేన్ విలియమ్సన్: 1
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ 17 మ్యాచ్‌లలో ఆడి 735(64 ఫోర్లు, 28 సిక్సులు) పరుగులతో టాప్ 1గా నిలిచాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
మార్చి 23 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ సీజన్ 12 కొత్త ప్లేయర్లు కొద్దిపాటి మార్పులతో ఆరంభం కానుంది. గత ప్రదర్శనను కొనసాగిస్తారో.. కొత్త ప్లేయర్ల ధాటికి వెనుకబడతారో చూడాల్సిందే.