చెన్నై సూపర్ కింగ్స్ గురించి పూర్తి సమాచారం

చెన్నై సూపర్ కింగ్స్ గురించి పూర్తి సమాచారం

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో దూకుడుగా రాణిస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ 2018 విజేతగా నిలిచి పునరాగమనాన్ని ఘనంగా ఆరంభించింది. దాదాపు జట్టులో ఉన్న వాళ్లంతా సీనియర్లే.. సరిగా ఆడలేరంటూ వచ్చిన విమర్శలను కొట్టిపారేస్తూ.. టైటిల్ దక్కించుకుంది. 2013లో జట్టులోని ప్లేయర్లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో రెండేళ్ల పాటు నిషేదానికి గురైంది. 

ఆ తర్వాత 2018లో లీగ్‌లోకి అడుగుపెట్టిన సూపర్ కింగ్స్.. జట్టులో కీలకమార్పులతో బరిలోకి దిగింది. రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకోకపోవడం సంచలనం రేపినా.. రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, సురేశ్ రైనా, మురళీ విజయ్‌లతో అద్భుతాలు సృష్టించింది. విదేశీ ప్లేయర్లు అయిన షేన్ వాట్సన్, డేన్ బ్రావో, ఫాఫ్ డుప్లెసిస్, ఇమ్రాన్ తాహిర్‌లతో శక్తివంతంగా తయారైంది. 

బలాలు:
బ్యాటింగ్ పరంగా చెన్నై జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. టీంలో ఉన్న ఇద్దరు క్వాలిటీ ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయ్‌లు గత సీజన్‌లో అద్భుతంగా రాణించారు. వారి తర్వాత ఆర్డర్‌లో డుప్లెసిస్.. కీలకమైన నాలుగో స్థానంలో అంబటి రాయుడు జట్టుకు వెన్నెముకగా నిలిచారు. ఇక ధోనీ, సురేశ్ రైనాల వరకూ బ్యాటింగ్ ఆర్డర్ వచ్చిందంటే బాదుడే పని అన్నట్లు సాగిపోతుంటారు. బ్యాటింగ్ ఆర్డర్లో చివరిగా ఉన్న ఆల్ రౌండర్ బ్రావో మంచి గేమ్ ఫినిషర్.

బలహీనతలు:
బ్యాటింగ్ లైన్ బాగున్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ లో ఫేస్ విభాగం కాస్త బలహీనంగానే కనిపిస్తుంది. భారత సీమర్లు అయిన మోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్‌లు సంతప్తికర ప్రదర్శనచేయలేకపోతున్నారు. విదేశీ ప్లేయర్లు అయిన డేవిడ్ విల్లే, లుంగీ ఎంగిడీ ఫేసర్లుగా డేన్ బ్రావో మీడియం ఫేస్‌గా పరవాలేదనిపిస్తున్నారంతే. 

కోచ్: స్టీఫెన్ ఫ్లెమింగ్

యజమాని: చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు: 
ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్, కేఎమ్ ఆసిఫ్, కర్న్ శర్మ, ధ్రువ్ సొరేయ్, డుప్లెసిస్, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, శామ్ బిల్లింగ్స్, మిచెల్ శాంతర్, డేవిడ్ విల్లే, డేన్ బ్రావో, షేన్ వాట్సన్, లుంగీ ఎంగిడీ, ఇమ్రాన్ తాహిర్, కేదర్ జాదవ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, జగదీశన్, శార్దూల్ ఠాకూర్, మోనూ కుమార్, చైతన్య బిషనోయ్, మోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్

షెడ్యూల్:
మ్యాచ్ 1:
 చెన్నై సూపర్ కింగ్స్  vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో

మ్యాచ్ 2: ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్  మార్చి 26న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో.. 

మ్యాచ్ 3: చెన్నై సూపర్ కింగ్స్  vs రాజస్థాన్ రాయల్స్ మార్చి 31న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ..

మ్యాచ్ 4: ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 03న ముంబైలోని వాంఖడే స్టేడియంలో