IPL 2019, CSKvRCB: తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిందెవరంటే..

IPL 2019, CSKvRCB: తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిందెవరంటే..

Updated On : March 23, 2019 / 1:50 PM IST

భారీ అంచనాల మధ్య, తీవ్రమైన ఉత్కంఠల మధ్య ఐపీఎల్ 12 సీజన్ మొదలైంది. తొలి పోరులో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు VS చెన్నై సూపర్ కింగ్స్‌ల మధ్య టాస్‌లో సూపర్ కింగ్స్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్‌తో లీగ్ ఆరంభం కానుంది. 
Read Also : సన్‌రైజర్స్ : విలియమ్సన్ లేకపోతే అతనే కెప్టెన్?

టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ వ్యూహాలు రచించడంలో దిట్ట. మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బలహీనంత కూడా అదే. సీనియర్లు, స్టార్ ప్లేయర్లతో బరిలోకి దిగే చెన్నైను ఢీకొట్టగలదా.. టైటిల్‌ను ముద్దాడాలని 12 సంవత్సరాల నాటి కలను తీర్చుకోగలదా.. 

* చెన్నై సూపర్ కింగ్స్ 15 సార్లు గెలిచి 7సార్లు మాత్రమే ఓడిపోయింది. 
* 2008 నుంచి ఇప్పటివరకూ చెపాక్ స్టేడియం వేదికగా ఆర్సీబీ ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేదు. దాంతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ పై ఆఖరి సారి 2014లో మాత్రమే గెలిచింది. 
* సీఎస్కే చెపాక్ స్టేడియం వేదికగా ఆడిన 13 మ్యాచ్ లలో 12 గెలిచి 1 మాత్రమే ఓడిపోయింది. 
* ఇరు జట్ల హోరాహోరీ పోరులో మొత్తంగా కెప్టెన్ కోహ్లీ 732పరుగులు చేస్తే.. కెప్టెన్ ధోనీ 710 పరుగులు మాత్రమే చేయగలిగాడు.