ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నా : జగన్
రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయనగరం : రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. నేను చంద్రబాబుతో ఒక్కడితో యుద్ధం చేయట్లేదని, ఎల్లో మీడియాతో ప్రతిరోజూ యుద్ధం చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. అమ్ముడు పోయిన మీడియాతోనే ఈ పోరాటం అన్నారు జగన్. వీళ్ళంతా పోలింగ్ తేదీ లోపు.. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్టు చూపిస్తారని అది చూసి మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Read Also : మోహన్ బాబు ఊసరవెల్లి : పారితోషికం ఎంత అందింది – బుద్ధా వెంకన్న
రాష్ట్రంలో అన్యాయమైన పాలన పోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ తేదీలోపు చంద్రబాబు చెప్పని అబద్దం ఉండదు.. చేయని మోసం ఉండదంటూ ప్రజలకు వివరించారు. ఒక్కో ఓటుకు 3వేల రూపాయలు చంద్రబాబు ఇస్తాడని.. ఆ డబ్బుకు ఆశపడి జీవితంలో మోసపోవద్దని కోరారు. మే 23 తర్వాత అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి కార్యక్రమం క్రింద బడికి వెళ్లే పిల్లలకు సంవత్సరానికి 15 వేలు ఇస్తానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
మీ పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవ్వటానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినా చదివిస్తానని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో.. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చాక వడ్డీ కూడా మాఫీ చేయని విషయాన్ని గుర్తు చేశారు జగన్. అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల తేదీ వరకు ఉన్న డ్వాక్రా రుణాలను 4 విడతల్లో మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. వైఎస్సార్ చేయూత పథకం పేరుతో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తానని ప్రకటించారు జగన్.
Read Also : జగన్ 135 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు : మోహన్ బాబు