అమరావతిపై కేసులు వేసిన జగన్ ఓ ఉన్మాది
గుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.

గుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.
గుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రజల కలల రాజధాని అమరావతిపై కేసులు వేసిన జగన్ ఓ ఉన్మాది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పన్నినా అదిరిపోయే అమరావతిని పూర్తి చేసి తీరతామని..ప్రపంచం మెచ్చుకునే అత్యున్నత నగరంలో అమరావతిని నిర్మిస్తానని చంద్రబాబు తెలిపారు.
అమరావతికి భూములిచ్చిన రైతులను జగన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన పెద్ద మనస్సుతో బంగారం పండే భూములను రాజధానికి ఇచ్చిన ఘనత రైతులదేనన్నారు. మనం అమరావతి వాసులని అని చెప్పుకునేందుకు గర్వపడేలా అమరావతి నిర్మిస్తానని చంద్రబాబు అన్నారు.
Read Also : వైసీపీకి అడ్రస్ ఉండదు.. డిపాజిట్ కూడా దక్కదు
హైదరబాద్ నగరాన్ని అంతర్జాతీయ పటంలో పెట్టి బంగారు గుడ్లు పెట్టేలా హైదరాబాద్ ను తీర్చి దిద్దాననీ కానీ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్లుగా కష్టపడింది మనమైతే హైదరాబాద్ ఆదాయాన్ని కేసీఆర్ కొట్టేశాడని విమర్శించారు. కానీ కష్టపడే మనస్తత్వం ఉన్న మనం మాత్రం మెరుగైన జీవితం కోసం ప్రణాళికలు వేసుకుంటు అభివృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ ను ముందంజలో ఉంచేందుకు కష్టపడుతున్నామన్నారు.
ఎన్ని కష్టాల్లో ఉన్నా..సంక్షేమ పథాకాలను మాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నామని..తనను మరోసారి గెలిపిస్తే మరింతా ఏపీకి అభివృద్ధి చేసి మరింత సందప సృష్టించి ఆనంద కరమైన జీవితాలను నిర్మించుకుందామని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కానీ నేరస్థులకు అధికారాన్ని కట్టబెడితే రాష్ట్రాన్ని దోచుకు తినేస్తారని తెలిపారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను