గత ఎన్నికల్లో ఒక్క సీటే.. కడపలో టీడీపీ వ్యూహం.. 7 సీట్లు ఖరారు

జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు బలంగా ఉన్న కడప జిల్లాలో సీట్ల ఎంపిక విషయంలో పెద్ద చర్చే జరిగింది. 

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 03:37 AM IST
గత ఎన్నికల్లో ఒక్క సీటే.. కడపలో టీడీపీ వ్యూహం.. 7 సీట్లు ఖరారు

జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు బలంగా ఉన్న కడప జిల్లాలో సీట్ల ఎంపిక విషయంలో పెద్ద చర్చే జరిగింది. 

జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు బలంగా ఉన్న కడప జిల్లాలో సీట్ల ఎంపిక విషయంలో పెద్ద చర్చే జరిగింది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఒక్క సీటు మాత్రమే దక్కించుకున్న టీడీపీ.. ఎప్పటి నుంచో జిల్లాలో పాగా వెయ్యాలని ఎదురుచూస్తోంది. రాజంపేట అసెంబ్లీ మాత్రమే టీడీపీ గత ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు టీడీపీ అనేక పర్యాయాల చర్చల అనంతరం.. ఏడు సీట్లను తొలి జాబితాలో ప్రకటించింది.
Read Also: నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

కడప జిల్లాలో మొత్తం పది స్థానాలుండగా..  బద్వేలు, రాజంపేట, రాయచోటి, పులివెందుల, కమలాపూర్, జమ్మలమడుగు, మైదుకూరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి.. మరో మూడు స్థానాలను పెండింగ్‌లో ఉంచారు. రైల్వే కోడూరు, కడప, ప్రొద్దుటూరు స్థానాలను తెలుగుదేశం రెండవ విడత జాబాతాలో ప్రకటించే అవకాశం ఉంది.

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -02
ఓసీలు- 05

కడప జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
పులివెందుల- సింగరెడ్డి వెంకట సతీశ్ రెడ్డి
రాజంపేట- బత్యాల చెంగల్రాయుడు
రాయచోటి- రెడ్డప్పగారి రమేశ్‌ కుమార్‌ రెడ్డి
కమలాపురం- పుత్తా నర్శింహా రెడ్డి.
మైదుకూరు-పుట్టా సుధాకర్ యాదవ్.  
జమ్మలమడుగు- రామసుబ్బారెడ్డి.
బద్వేలు- ఓబులాపురం రాజశేఖర్