కర్నూలులో ఖరారైన 9 సీట్లు.. భూమాకు సీటు లేదా?

  • Published By: vamsi ,Published On : March 15, 2019 / 07:55 AM IST
కర్నూలులో ఖరారైన 9 సీట్లు.. భూమాకు సీటు లేదా?

కర్నూలు జిల్లాలో రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోగా ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నుంచి వచ్చిన నేతలు మారిన రాజకీయం కారణంగా సీట్ల విషయంలో చంద్రబాబు ఆచితూచి అభ్యర్ధులను ఎంపిక చేశారు. కొత్తగా చేరిన నేతలు పాత నేతలను భేరీజు వేసుకున్న తెలుగుదేశం..  జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు
డోన్, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, పాణ్యం, శ్రీశైలం, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల టిక్కెట్లను ఖరారు చేశారు. అయితే భూమా నాగిరెడ్డి  మరణంతో ఉపఎన్నిక రాగా గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డికి నంద్యాల టిక్కెట్‌ను ఖరారు చేయలేదు. దీంతో  భూమా బ్రహ్మానందరెడ్డికి టిక్కెట్ లేదా? అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అలాగే కర్నూలు అర్బన్, నందికొట్కూరు, కొడుమూరు, బనగానపల్లె సీట్లకు కూడా అభ్యర్ధులను ఖరారు చేయలేదు. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -2
ఓసీలు- 7

కర్నూలు జిల్లా తెలుగుదేశం అభ్యర్ధులు:
డోన్-కేఈ ప్రతాప్‌
పత్తికొండ-కేఈ శ్యామ్‌బాబు
మంత్రాలయం- పి.తిక్కారెడ్డి
ఎమ్మిగనూరు-బీవీ జయనాగేశ్వరరెడ్డి
ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
పాణ్యం-గౌరు చరితారెడ్డి
శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
ఆదోని-మీనాక్షి నాయుడు
ఆలూరు-కోట్ల సుజాతమ్మ

ఖరారు కాని స్థానాలు:
నంద్యాల
కర్నూలు అర్బన్.
నందికొట్కూరు.  
కొడుమూరు.
బనగానపల్లె
Read Also: వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా