విశాఖలో దారుణం : ఇద్దరు బాలికలపై ట్రాన్స్ పోర్ట్ యజమాని అత్యాచారం

విశాఖపట్నం చిన్నముసిరివాడ హుడా కాలనీలో ఓ కామాంధుడు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. లారీ ట్రాన్స్ పోర్ట్ యజమాని అరవింద్ పక్కంటిలో ఉంటున్న ఇద్దరు చిన్నారులపై కన్నేశాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన అరవింద్ ఇద్దరు బాలికలపై అత్యాచారానికి తెగబడ్డాడు.
అరవింద్ పక్కింటిలో ఉంటున్న బాలికలపై కన్నేశారు. వారు ఎప్పుడు చిక్కుతారా అని కాచుకుని కూర్చున్నాడు. భర్త తీరుపై అనుమానం వచ్చిన అరవింద్ భార్య భర్తను మందలించింది. కోప్పడింది. ఈ క్రమంలో నవంబర్ 3న కట్టుకున్న భార్యతో గొడవలు పడ్డాడు. దీంతో బాలికలిద్దరికీ మాయ మాటలు చెప్పి సింహాచలం తీసుకెళ్లాడు.అక్కడ 15 సంవత్సరాల వయస్సున్న ఓ బాలిక మెడలో తాళికట్టాడు.మనం పెళ్లి చేసుకున్నాం కదా మనిద్దరం భార్యా భర్త అని చెప్పాడు. అలా ఇద్దరినీ విజయవాడ, ఒంగోలు తీసుకెళ్లి ఇద్దరిపైనా అత్యాచారం చేశాడు.
భర్త కనిపించటంలేదంటూ అరవింద్ భార్య పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అతని కోసం గాలించిన పోలీసులకు నవంబర్ 9న పట్టుబడ్డాడు. అరవింద్ ను విచారించగా అసలు విషయాన్ని బైటపెట్టాడు. దీంతో పోలీసులు అరవింద్ ను అరెస్ చేసి రిమాండ్ కు పంపించి..బాలికలిద్దరిని తమ అధీనంలో ఉంచుకున్నారు. నవంబర్ 15న బాలికల తల్లి కూడా అరవింద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా..గతంలో కూడా అరవింద్ ఆ ఇద్దరి బాలికలపై ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా వెల్లడైంది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.