ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు.

  • Published By: veegamteam ,Published On : January 11, 2020 / 02:39 AM IST
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి

Updated On : January 11, 2020 / 2:39 AM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల సిబ్బందిని ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. SEC కార్యాలయం నుంచి పంచాయతీరాజ్‌, పోలీసు అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికలను పూర్తి స్వేచ్ఛగా, కచ్చితత్వంతో, పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలన్నారు. 

ఇందుకోసం జిల్లాల్లో చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. అధికారులకు, సిబ్బందికి విధుల కేటాయింపు, ఎన్నికల సామగ్రి తరలింపు, పంపిణీకి సంబంధించి జిల్లాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టి తగిన సూచనలు చేయాలని చెప్పారు.

తొలిదశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో కోటి 45లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రెండో దశలో 327జడ్పీటీసీలు, 4వేల 960ఎంపీటీసీలకు 16వేల 831కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కోటి 36 లక్షల మంది  ఓటర్లు పాల్గొంటారు. ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. రెండు దశల ఎన్నికల్లో సుమారు 2 లక్షల 18వేల  మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. జోనల్‌ అధికారులు, సర్వేయర్‌ టీమ్స్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షించే అధికారులకు, జ్యుడీషియల్‌ అధికారులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు.

తొలిదశలో 333 జడ్పీటీసీలు, 5,352 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో కోటి 45లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక రెండో దశలో 327జడ్పీటీసీలు, 4వేల 960 ఎంపీటీసీలకు 16వేల831 కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇందులో కోటి 36 లక్షల మంది  ఓటర్లు పాల్గొంటారు. ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించి ప్రత్యేక గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు. రెండు దశల ఎన్నికల్లో సుమారు 2 లక్షల 18వేల  మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. జోనల్‌ అధికారులు, సర్వేయర్‌ టీమ్స్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షించే అధికారులకు, జ్యుడీషియల్‌ అధికారులకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తారు.