శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు..మళ్లీ ఆస్పత్రిలో జాయిన్ అయిన అమిత్ షా

minister-amit-shah
కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. శ్వాస తీసుకోవటంతో ఇబ్బందులు రావటంతో షా మరోసారి హాస్పిటల్ జాయిన్ కావాల్సి వచ్చింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో షాను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి వచ్చిన షా కు మళ్లీ శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించారు. ఎయిమ్స్ లో ప్రత్యేక డాక్టర్ల బృందం షా ఆరోగ్య పరిస్థితిని ఎప్పుటికప్పుడు పరిశీలిస్తున్నారు.
కాగా..అమిత్ షా కరోనాకు కరోనా సోకగా ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. కరోనాకు చికిత్స తీసుకున్న ఆయన శుక్రవారం (ఆగస్టు 14) సాయంత్రం ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కానీ కొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లోనే ఉండి పూర్తి ఆరోగ్యంగా బైటపడ్డారు. ఈ క్రమంలో ఆయనకు మరోసారి శ్వాస సంబంధ సమస్యలు రావటంతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.