మోడీ 69వ పుట్టినరోజు : గుజరాత్ స్కూళ్లల్లో ప్రత్యేక వేడుకలు
సెప్టెంబర్ 17 (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకులను ఘనంగా జరుపుకోనున్నారు.

సెప్టెంబర్ 17 (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకులను ఘనంగా జరుపుకోనున్నారు.
సెప్టెంబర్ 17 (మంగళవారం) ప్రధాని నరేంద్ర మోడీ 69వ పుట్టినరోజు. దేశవ్యాప్తంగా మోడీ పుట్టినరోజు వేడుకులను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేకించి గుజరాత్ లో అన్ని స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నారు. మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని అహ్మదాబాద్ జిల్లా విద్యా సంస్థ.. తమ ఆధ్వర్యంలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని స్కూళ్లకు ఓ సర్య్కూలర్ జారీ చేసింది.
మోడీ పుట్టినరోజున ప్రతి పాఠశాలలో ప్రత్యేక బోధనలు, డిబేట్లు, ఎస్సే రైటింగ్, కాంపిటీషన్స్, గ్రూప్ డిస్ కషన్స్, ఇతర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజున వేడుకలు జరుపుకోనున్నారు. సెకండరీ, హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ లో ఆర్టికల్స్ 370, 35A సోషల్ సైన్సెన్స్ సబ్జెక్టులుగా ఉన్నాయి.
అందుకే ఎడ్యుకేషన్ పరంగా సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించామని బోర్డు తెలిపింది. అన్ని స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A గురించి విద్యార్థులకు నిపుణులు ఎవరైనా అవగాహన కల్పించవచ్చునని సర్క్యూలర్ తెలిపింది.
ఏదో ఒక సామాజిక అంశంపై.. దేశ ప్రధానుల పుట్టినరోజు వేడుకలను ప్రత్యేకించి జరుపుకోవడం సర్వ సాధారణం. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజును కూడా చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నారు. విద్యకు సంబంధించి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించినట్టు అహ్మదాబాద్ జిల్లా విద్యాధికారి (రూరల్) రాకేశ్ ఆర్. వ్యాస్ తెలిపారు.