బాబూ.. నీకు క్యారెక్టర్ ఉందని ఎవరూ చెప్పారు : మోహన్ బాబు ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తనదైనశైలీలో మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 12:43 PM IST
బాబూ.. నీకు క్యారెక్టర్ ఉందని ఎవరూ చెప్పారు : మోహన్ బాబు ఫైర్

Updated On : March 30, 2019 / 12:43 PM IST

ఏపీ సీఎం చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తనదైనశైలీలో మోహన్ బాబు కౌంటర్ ఇచ్చారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై చంద్రబాబు విమర్శలపై తనదైనశైలీలో ఆయన కౌంటర్ ఇచ్చారు. శనివారం (మార్చి 30, 2019) మీడియా సమావేశంలో మోహన్ బాబు మాట్లాడూతూ.. చంద్రబాబు ఓ మైడియర్ గ్రేట్ ఫ్రండ్.. ఎదుటివాడు బాగుంటే ఒరవలేని మనసత్వం నీది.. అసలు నీకు క్యారెక్టర్ ఉందని ఎవరు చెప్పారు? అంటూ ఘాుటుగా ప్రశ్నించారు.

క్యారెక్టర్ అంటే మన దేశంలో గొప్ప నటుడుగా ఒక నిర్మాతగా లంచం అనే పదానికి అర్ధం తెలియనటువంటి మహానటుడు ఎన్టీ రామారావు అని అన్నారు. నిద్రాహారాలు మాని రోడ్లలో స్నానాలు చేసి తెలుగువాడు అనే ఒక పౌరుషం తీసుకు వచ్చిన ఒక మహానటుడు స్థాపించిన తెలుగుదేశాన్ని నువు ఎన్నో రకాలుగా లాక్కున్నావ్ అంటూ ధ్వజమెత్తారు. 
 
చంద్రబాబు మాయలో పడి మేము కూడా వచ్చామని, ఏదొ జరుగుతోందని  నీ వెంట వస్తే.. మరుసటిరోజు తెలిసింది నువు ఇలాంటి వాడివా అని అన్నారు. నువ్వు లాక్కున్న తెలుగుదేశం.. ఇది నీది కాదు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ధాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అతనిది. అతను తన తండ్రి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలను బాగు చేయాలని, ఆ ప్రజలకు నేనున్నాని చెప్పడం కోసం ప్రజల్లోకి వచ్చాడు.

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. ప్రజల్లో నమ్మకాన్ని కాపాడటం కోసం కంకనం కట్టుకుని 10 సంవత్సరాల నుంచి ఏకదాటిగా నడుస్తున్న వ్యక్తి  వైఎస్ జగన్ అని మోహన్ బాబు అంటూ వ్యాఖ్యానించారు.