3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చాం : ఎంపీ సీతారాం నాయక్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రానికి 3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చామని ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 08:47 AM IST
3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చాం : ఎంపీ సీతారాం నాయక్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రానికి 3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చామని ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు.

వరంగల్ : తెలంగాణ విభజన జరిగేంతవరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు వచ్చింది 2517 కిలో మీటర్ల జాతీయ రహదారులు అని ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ ఎంపీలు అందరం కలిసి 3500 కిలో మీటర్ల రోడ్లను తీసుకొచ్చామని తెలిపారు. ఈమేరకు ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ  ఇందులో తాను 340 కిలో మీటర్ల రోడ్డును కేసీఆర్ ను అడిగి ప్రాదేయపడి సాధించానని చెప్పారు. 

వీటిలో 240 కిలో మీటర్లు వలిగొండ నుంచి భద్రాచలం వరకు జైశ్రీరాం పేరుతో రోడు వేశామని.. అన్ని పనులు పూర్తి అయ్యాయని…నెంబర్ ఇస్తే టెండర్ అవుతుందన్నారు. మల్లంపెల్లి నుంచి పసర మధ్య 33 కిలో మీటర్ల రోడ్డు పనులు ఆగిపోతే చేయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు చేశాక కూడా చేయలేదంటే బాధ కల్గుతుందన్నారు. అబద్ధపు ప్రచారం మానుకోవాలన్నారు. మూడు రాష్ట్రాల డబ్బులతో బాక్రా నంగల్ డ్యామ్ కట్టారని..అందులో ఎస్టీలకు రిజర్వేషన్ లేదని వాపోయారు.