పోటెత్తుతున్న వరద : నాగార్జునసాగర్‌ 24 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో పాజెక్ట్‌ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : September 13, 2019 / 09:47 AM IST
పోటెత్తుతున్న వరద : నాగార్జునసాగర్‌ 24 గేట్లు ఎత్తివేత

Updated On : September 13, 2019 / 9:47 AM IST

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. దీంతో పాజెక్ట్‌ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జునసాగర్‌ పాజెక్ట్‌ 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పది అడుగుల మేర గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

ప్రస్తుతం సాగర్‌లోకి 3లక్షల 60 వేల 368 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఔట్ ఫ్లో 4 లక్షల 10 వేల 368 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్‌ పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 590.0450 అడుగుల నీరు నిల్వ ఉంది.

Also Read : దేవాలయ పాలకమండళ్లు, ట్రస్ట్‌ బోర్డుల్లో రిజర్వేషన్లు