జగన్ కు సీబీఐ కోర్టు షాక్

  • Published By: chvmurthy ,Published On : January 17, 2020 / 10:18 AM IST
జగన్ కు సీబీఐ కోర్టు షాక్

Updated On : January 17, 2020 / 10:18 AM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి  విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను  కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచారణ  పూర్తయ్యేంతవరకు ఈడీ విచారణ చేపట్టరాదన్ని జగన్ పిటీషన్ ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది.  కేసును వచ్చే వారానికి వాయిదా వేసింది.

ys jaganmohan reddy

పెన్నా చార్జి షీట్ లో అనుబంధ అభియోగ పత్రంపై విచారణ ప్రక్రియను ఈరోజు సీబీఐ కోర్టు ప్రారంభించింది. కాగా ఈ ఆస్తుల కేసులో విచారణకు వ్యక్తిగతంగా హజరునుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా …కోర్టు ఈ వారానికి మినహాయింపు ఇచ్చింది. దీనికోసం ఆబ్సెంట్ పిటీషన్ దాఖలు చేశారు.  కాగా ఈ కేసులో  ఏ-2 నిందితుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి,తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణకు హజరయ్యారు.   అనంతరం అన్ని కేసుల విచారణను ఈనెల 24 కివాయిదా వేశారు. 

 vijaya sai reddy

జగన్ తన ఆస్తుల కేసుకు సంబంధించి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏపీకి సీఎం అయిన తర్వాత అధికారిక, ఇతరత్రా కార్యక్రమాల వల్ల తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని జగన్  గతవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

dharmana sabita

ఈడీ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్లు అన్నింటిని కలిపి విచారించాలని కూడా వేసిన పిటిషన్లపై వాదనలు గత వారం పూర్తయ్యాయి. 
కాగా..కేసు విచారణ కోర్టు  ఈనెల 24కు వాయిదా వేయటంతో జగన్‌కు ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు లభిస్తుందా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

sri lakshmi ias