జగన్‌కు 150మంది బినామీలు ఉన్నారు: లోకేశ్

జగన్‌కు 150మంది బినామీలు ఉన్నారు: లోకేశ్

Updated On : January 20, 2020 / 5:42 AM IST

అమరావతి రాజధాని అనే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిద్ధమైంది. ఓ వైపు 3రాజధానుల నిర్ణయం దిశగా వైసీపీ మొగ్గు చూపుతుంటే మరోవైపు రాజధానిని మార్చేది లేదని టీడీపీ ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అనుచరులతో కలిసి పాదయాత్రగా వెళ్లేముందు నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. 

తెలుగుదేశం పార్టీ వ్యూహం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే. పాలన ఒకచోట నుంచే చేయాలనేదే మా ఉద్దేశ్యం. ఈ క్రమంలోనే అనంతపురంలో కియా మోటార్స్ తెచ్చాం. చిత్తూరు సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ తీసుకొచ్చాం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిషరీస్ పరిశ్రమను తీసుకొచ్చాం. నెల్లూరులో కీలక పరిశ్రమలు, వైజాగ్ ఐటీ పరిశ్రమలు, నూలు వంటివన్నీ చేశాం. ఇదీ అభివృద్ధి అంటే’

‘పరిపాలన వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి జరగదు. ఈ విధానాన్ని అనేక దేశాలు ప్రయత్నించి ఫెయిలైయ్యాయి. అమెరికాలో ఓ చోట పాలన ఉంటే శాన్ ప్రాన్సిస్కోలో ఐటీ పరిశ్రమలు ఉంటాయి అలా ఉండాలి కానీ, పరిపాలన వికేంద్రీకరణ ఎక్కడ సక్సెస్ అయిందని ప్రశ్నించారు. 

అమరావతి భూములు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు గురయ్యాయని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. లోకాయుక్తలో పెడతామని జగన్ చెప్తున్నారు. జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తానన్నారు. చేయమనండి సిద్ధంగా ఉన్నాం. సూట్ కేసులు కంపెనీ, ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసింది జగన్. మేం కాదు. 

నాకు బినామీ వేముల రవి అని ఎలా అంటారు. బినామీ అంటే డబ్బులు వెళ్లాలి కదా.. ఎక్కడ వెళ్లినయ్. అమరావతి నుంచి 30కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్‌కు సంబంధించిన భూమిని 14ఎకరాలు కొంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారా ఏం మాట్లాడుతున్నారు. అమ్మినోడికి, కొన్నోడి నుంచి ఫిర్యాదులేం లేకుండా ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఎలా అంటారని ప్రశ్నించారు.