సీఎం జగన్‌కు నారా లోకేశ్ విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ శ్రేణులతో పాటు అభిమానుల నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వారి కంటే ప్రత్యేకంగా మాజీ మంత్రి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని పోస్టు చేశారు.
ఈయనతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి టార్చ్ బేరర్ అంటూ పొగడ్తలు కురిపిస్తూ విష్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ టార్చ్ బేరర్ వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజున, మన ప్రియమైన ముఖ్యమంత్రికి అండగా నిలబడాలని, ఆంధ్రప్రదేశ్‌ను శక్తివంతంగా మరియు పురోగతి సాధించడానికి బేషరతుగా మద్దతు ఇవ్వమని అందరినీ కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వై సుజనా చౌదరి ట్విట్టర్ ద్వారా ఏపీ సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Happy birthday to the torch bearer of Andhra Pradesh, @ysjagan Garu. On this special day, I urge all to stand by our beloved Chief Minister, & offer unconditional support to make Andhra Pradesh, mightier and progressed. #HBDBelovedCMYSJagan #HBDCMYSJagan
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 21, 2019
ఏపీ ముఖ్యమంత్రి @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను
— Lokesh Nara (@naralokesh) December 21, 2019
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు. @AndhraPradeshCM #jaganMohanReddy #HappyBirthDayCMYSJagan pic.twitter.com/TNqp10MGf1
— YS Chowdary (@yschowdary) December 21, 2019