సుఖాంతం : నిజామాబాద్‌లో కరీంనగర్ స్టూడెంట్స్

  • Published By: madhu ,Published On : February 23, 2019 / 03:58 PM IST
సుఖాంతం : నిజామాబాద్‌లో కరీంనగర్ స్టూడెంట్స్

Updated On : February 23, 2019 / 3:58 PM IST

కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. వారు ఎక్కడున్నారో విషయం తెలియకపోవడంతో స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. 

కేశవపట్నం కస్తూర్బాగాంధీ పాఠశాలలో 5గురు విద్యార్థినులు కనిపించకుండా పోయారు. ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం ఈ విషయం గుర్తించి పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు కలత చెందారు. పోలీసులు రంగంలోకి దిగి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అర్ధరాత్రి సమయంలో వీరు ఎక్కడకి వెళుతున్నారు, సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా పసిగట్టారు. వీరందరూ నిజామాబాద్ బస్టాండులో ఉన్న విషయం గుర్తించారు. వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఐదుగురు విద్యార్థినులను స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం తల్లిదండ్రులకు అప్పచెబుతామని పోలీసులు పేర్కొన్నారు. మొత్తంగా వీరి అదృ‌శ్యం సుఖాంతం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.