ఇది నిజంగా గుడ్ న్యూస్, ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. ఏపీలో ఇవాళ(గురువారం ఏప్రిల్ 9,2020) ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. ఏపీలో ఇవాళ(గురువారం ఏప్రిల్ 9,2020) ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
ఏపీలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వానికి, ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. ఏపీలో ఇవాళ(గురువారం ఏప్రిల్ 9,2020) ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కొద్దిరోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యఆరోగ్య బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షల్లో 217 శాంపిల్స్‌ను పరీక్షించగా.. అన్ని కేసులు నెగటివ్‌గా వచ్చాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 348గా ఉంది. 9మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసుల్లో కర్నూలు(75) జిల్లా టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదు కాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు.(రేప్ లు, హత్యలు, ఆత్మహత్యలు, చోరీలు తగ్గాయి.. లాక్‌డౌన్‌తో 23శాతం పడిపోయిన క్రైమ్ రేట్)
ఇవాళ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం ప్రభుత్వానికి కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఏ రోజు చూసినా పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. దీంతో అధికారులు, ప్రజల్లో కంగారు పెరిగింది. రోజురోజుకి ఇలా కేసుల సంఖ్య పెరిగిపోతే కంట్రోల్ చెయ్యడం ఎలా అని టెన్షన్ పడ్డారు.
జిల్లాల వారీగా నమోదైన కేసులు:
#CovidUpdates: రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసు లు నెగటివ్ గా నిర్దారించబడ్డాయి#ApFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lgTKOJP19y
— ArogyaAndhra (@ArogyaAndhra) April 9, 2020