మూడేళ్ల తర్వాత : ఉల్లి రైతుల కళ్లలో ఆనందం

ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్

  • Published By: veegamteam ,Published On : September 19, 2019 / 04:26 AM IST
మూడేళ్ల తర్వాత : ఉల్లి రైతుల కళ్లలో ఆనందం

Updated On : September 19, 2019 / 4:26 AM IST

ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్

ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. మూడేళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మంగళవారం(సెప్టెంబర్ 17,2019) క్వింటాల్‌ ఉల్లి గరిష్ట ధర రూ.3,310 ఉండగా.. బుధవారం(సెప్టెంబర్ 18,2019) ఒక్కసారిగా రూ.4 వేలకు చేరింది. ఒక్క రోజులోనే రూ.690 పెరగడం విశేషం. అత్యధిక లాట్లకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు ధర లభించింది. మూడేళ్లుగా ఉల్లి ధరలు పడిపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. 2018లో క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.600 వరకు మాత్రమే లభించింది. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో 2018 వరకు మూటకట్టుకున్న నష్టాల నుంచి రైతులు బయటపడుతున్నారు.

మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. ఇది ఏపీ రైతులకు కలిసొచ్చింది. కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లి పంటకు డిమాండ్‌ ఏర్పడింది. ఏపీలో ఉల్లి అత్యధికంగా పండేది కర్నూలు జిల్లాలోనే. మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడంతో వ్యాపారుల దృష్టి కర్నూలు మార్కెట్‌పై పడింది. ఉల్లి కొనేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. దీంతో ధరలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం క్వింటాల్‌ రూ.4 వేలకు చేరగా.. ఈ ధర మరింత పెరిగే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ధరలు పెరుగుతుండడంతో మార్కెట్‌కు ఉల్లిగడ్డలు కూడా పోటెత్తుతున్నాయి. మార్కెట్‌ యార్డులో కనీసం 20 వేల క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి.

కర్నూలు జిల్లాలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21,145 హెక్టార్లు. ఈ ఖరీఫ్‌లో 13,235 హెక్టార్లలో సాగైంది. ధరలు పెరుగుతుండడంతో రైతులు కూడా పోటీపడి సాగు చేస్తున్నారు. దీంతో ఉల్లి విత్తనాల ధరలు కూడా చుక్కలనంటుతున్నాయి. 2018 వరకు ఉల్లి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరుగుతుండడంతో నష్టాల నుంచి బయటపడుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు. లాభాలు వస్తున్నాయని ఖుషీ అవుతున్నారు.