ఆపరేషన్ వశిష్ట-2 : బోటుతో పాటు బయటపడ్డ 5 మృతదేహాలు

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 09:46 AM IST
ఆపరేషన్ వశిష్ట-2 : బోటుతో పాటు బయటపడ్డ 5 మృతదేహాలు

Updated On : October 22, 2019 / 9:46 AM IST

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన

ఆపరేషన్ రాయల్ వశిష్ట-2 సక్సెస్ అయ్యింది. ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కచ్చులూరు దగ్గర గోదావరి నది నుంచి బోటుని వెలికితీశారు. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు బయటపడింది. బోటులో నుంచి 5 మృతదేహాలు కూడా బయటపడ్డాయి. 38 రోజులుగా మృతదేహాలు బోటులోనే ఉన్నాయి. మిగతా మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ధర్మాడి టీమ్ బోటుని నీటి లోపలి నుంచి వెలికితీసింది.

కాగా, బోటుని ఒడ్డుకి చేర్చడానికి మరో 3 గంటలు పట్టే అవకాశం ఉంది. తీవ్ర ప్రయత్నాలు తర్వాత బోటుని నీళ్లపైకి తీసుకొచ్చింది ధర్మాడి సత్యం బృందం. లంగర్లు, ఐరన్ రోప్స్ సాయంతో బోటుని వెలికితీశారు. ఉచ్చుకి చిక్కిన బోటు పైకి తేలింది. పోర్టు అధికారి ఆదినారాయణ నేతృత్వంలో ఆపరేషన్ జరిగింది. రాయల్ వశిష్ట టూరిస్ట్ బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. ధర్మాడి టీమ్ రెండు విడతల్లో బోటు ఆపరేషన్ చేపట్టింది. డీప్ సీ డైవర్ల సాయంతో బోటుకి ఉచ్చు బిగించడంలో సక్సెస్ అయ్యారు.

సెప్టెంబర్ 15న కచ్చులూరు దగ్గర బోటు ప్రమాదం జరిగింది. గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండలు వెళ్తుండగా బోటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77మంది టూరిస్టులు ఉన్నారు. ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటు ప్రమాదంలో ఇప్పటివరకు 44 మృతదేహాలు వెలికితీశారు. మరో 7 మృతదేహాల కోసం గాలిస్తున్నారు.