ఏపీలో పంచాయితీ ఎన్నికలు వాయిదా

  • Published By: vamsi ,Published On : March 15, 2020 / 04:44 AM IST
ఏపీలో పంచాయితీ ఎన్నికలు వాయిదా

Updated On : March 15, 2020 / 4:44 AM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రామ పంచాయితీల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఆరు వారాలు పాటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఇవాళ(15 మార్చి 2020) మొదటి దశ పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉండగా రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ అధికారి రమేష్ వెల్లడించారు. రాష్ట్రంలో 13,368 పంచాయితీలు ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ఖరారయ్యాయి.

వీటిలో 6,831 పంచాయితీలకు మహిళలకు కేటాయిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి వివరాలు అందజేసింది.