పేర్ని ఫైర్: పవన్ నాయుడు గారూ..మీరు హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాల్లో రేపు పవన్ పర్యటిస్తున్న సందర్భంగా మంత్రి పేర్ని స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏ పర్యటనలు చేసినా..ఏంపనిచేసినా ఆయన ప్రతీ అడుగూ..మాటా..పాటా ప్రతీదీ ఆయన ప్రేమించే వ్యక్తుల కోసమేననీ..మంత్రి పేర్ని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తే తాను విమర్శించాల్సిన పనిలేదనీ మంచి పాలన అందిస్తే తాను చక్కగా సినిమాలు తీసుకుంటానని గతంలో పవన్ అన్న మాటల్ని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్ ప్రజలకు మంచి పాలనే అందిస్తున్నారనీ..కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ ఏమీ టెన్షన్ పడాల్సిన పనిలేదనీ..చక్కగా సినిమాలు చేసుకోవచ్చు అంటూ సెటైర్లు వేశారు. పవన్ నాయుడు గారూ…మీరు మీ సినిమాలు హ్యాపీగా చేసుకోండి.
రాష్ట్రం గురించి మీరేమీ వర్రీ అవ్వనవసరం లేదు..రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి సీఎం జగన్ ఉన్నారు మీరు మీ సినిమాలు చేసుుకోండి చక్కగా డబ్బులు సంపాదించుకోండి అంటూ తనదైన శైలిలో మంత్రి పేర్ని నాని పవన్ పై సెటైర్లు వేశారు.