విద్యార్థితో గుంజిళ్లు తీయించిన పీఈటీ..నోటి వెంట రక్తం..

  • Published By: veegamteam ,Published On : December 14, 2019 / 07:15 AM IST
విద్యార్థితో గుంజిళ్లు తీయించిన పీఈటీ..నోటి వెంట రక్తం..

Updated On : December 14, 2019 / 7:15 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి గురుకుల స్కూల్లో పీఈటీ ఇచ్చిన పనిష్మెంట్ తో  ఓ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చింది. తొమ్మిదవ తరగతి చదివే హర్షవర్థన్ అనే విద్యార్థితో పీఈటీ 100 గుంజిళ్లు తీయించాడు. దీంతో హర్షవర్థన్ కు కాళ్లు విపరీతంగా నొప్పులకు తాళలేక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నాడు. దీంతో హర్షవర్షన్ నోటి వెంట రక్తం కారింది. దీంతో స్కూల్ సిబ్బంది హర్షవర్థన్ ను హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న హర్షవర్థన్ తల్లిదండ్రులు స్కూల్ హాస్టల్ కు చేరుకున్నారు. తమ కుమారుడి పరిస్థితికి కారణమైన పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..స్కూల్ హాస్టల్ ముందు ఆందోళన చేపట్టారు.కాగా..హర్షవర్థన్ కు పీఈటీ ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారో తెలియాల్సి ఉంది.