పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు ATM : మోడీ కొత్త డైలాగ్
రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్

రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్
రాజమండ్రి : ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని యూ టర్న్ బాబుగా అభివర్ణించిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చే నిధులను చంద్రబాబు తన ఖాతాలోకి వేసుకుంటున్నారని మోడీ ఆరోపించారు. కావాలనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆలస్యం చేస్తున్నారని, ఎప్పటికప్పుడు అంచనాలు పెంచుకుంటూ పోతూ దోచుకుంటున్నారని మోడీ చెప్పారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చెయ్యాలన్న చిత్తశుద్ధి ఏపీ ప్రభుత్వానికి లేదన్నారు. పోలవరం అంచనాలు పెంచుతూ కమీషన్లు దండుకుంటున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు పెంచడం ద్వారా.. యూ టర్న్ బాబు ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని మోడీ ప్రశ్నించారు.
Read Also : ఇదీ బాబుగారి ప్రేమ : కన్నతల్లిని కూడా చూసుకోలేదు
తొలి కేబినెట్ లోనే పోలవరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించామని మోడీ గుర్తు చేశారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రూ.7వేల కోట్లు ఇచ్చిందని మోడీ తెలిపారు. ఆ డబ్బంతా ఏమైందని ప్రశ్నించారు. రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. ఈ ఐదేళ్లలో దేశ గతిని మార్చేశామని మోడీ చెప్పారు. దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచామన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చామన్నారు. నవ భారతాన్ని నిర్మించేందుకు మీ ఆశీర్వాదం కావాలని మోడీ కోరారు. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలన్నారు.
నిజాయితీగా పన్ను చెల్లిస్తున్న వారి వల్లే దేశంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పిన మోడీ.. పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం కొత్త పన్ను ఒక్కటి కూడా తీసుకురాలేదని మోడీ చెప్పారు. పైగా పన్నుల భారం తగ్గిస్తూ వచ్చామన్నారు. రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేకుండా చారిత్రక నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ట్యాక్స్ పరిధి పెంచాలన్న ప్రజల విజ్ఞప్తిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మోడీ విమర్శించారు. ఎన్డీయే ప్రభుత్వం కురిడీ కొబ్బరి రైతులకు మద్దతు ధర పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు స్టికర్ బాబు పేర్లు మారుస్తున్నారని మోడీ విమర్శించారు. స్టిక్కర్ బాబుకి రైతుల గురించి ఆలోచించే తీరిక లేదన్నారు.
Read Also : జగనే కారణం : పులిలాంటి కడప పిల్లిలా మారింది