అమ్మబాబోయ్ : సూర్యాపేటలో 20 కిలోల బంగారు నాణాలు స్వాధీనం
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు.
ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా కిలోల కొద్దీ బంగారం. చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏదో నిధి రాశి పోసినట్లుగా కిలోల కొద్దీ బంగారు నాణాలు. ఓ సాధారణ వ్యక్తి ఇంట్లో ఉన్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఊరికనే ఉంటారా.. హుటాహుటిన బయలుదేరారు. సదరు వ్యక్తి నుంచి 20 కిలోల బంగారు నాణాలకు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది.
Read Also : సూసైడ్‌కి ముందు : కంటతడి పెట్టిస్తున్న ప్రేమికుల సెల్ఫీ వీడియో
సూర్యాపేట జిల్లాలో పోలీసులు 20 కిలోల బంగారు నాణాలను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జిల్లాలోని హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలో మంగళవారం (ఏప్రిల్ 16) రాత్రి సింగతల వీరారెడ్డి అనే వ్యక్తి నివాసంలో బంగారు నాణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరారెడ్డి తన ఇంట్లోనే మేకపోతుని బలిచ్చి 20కిలోల బంగారు నాణెపు నాణాలను దాచాడని కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, హుజూర్నగర్ సీఐ భాస్కర్ తెలిపారు.
బంగారు నాణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటిని సీజ్ చేశారు. వీరారెడ్డిని హుజూర్నగర్పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీనిపై పూర్తి విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా.. అమరవరంలో పెద్ద ఎత్తున బంగారపు నాణెల బిల్లలు లభ్యం కావడం సంచలనంగా మారింది. వీరారెడ్డికి అవి ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎక్కడ దొరికాయి అనేది ఆరా తీస్తున్నారు. 20 కిలోల బంగారం అంటే.. ఇప్పటి మార్కెట్ విలువ ప్రకారం 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్