సబ్బవరంలో రూ.కోటి పట్టివేత : ఇద్దరు అరెస్ట్

విశాఖపట్నం : ఎన్నికల వేళ వాహనాలలో నోట్ల కట్టల తరలింపు కలకలం సృష్టిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరంలో పోలీసుల తనిఖీల్లో కారులో తరలిస్తున్న కోటి రూపాయలు పట్టుబడ్డాయి. మండలంలోని పాతరోడ్డు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీలలో భాగంగా విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఎపి 31సిజె359 నెంబరు గల ఇండికా కారులో ట్రంక్ పెట్టెల్లో రూ.5లక్షలు చొప్పున ఉన్న 20 బండిల్స్ మొత్తం కోటి రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయంపై కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని ప్రశ్నించగా విశాఖపట్నం సీతంపేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి పాడేరు ఎపిజివికి తరలిస్తున్నట్లు తెలిపారు.
Read Also :20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే
కానీ ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న ఈ సొమ్ము విశాఖకు చెందిన అధికార పార్టీ వ్యక్తికి సంబంధించినది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగదుకు సంబంధించిన పత్రాలు చూపకపోవడంతో ఆన్‌క్రైమ్‌డ్ ప్రాఫిట్‌గా భావించి కోటి రూపాయల నగదును, కారును సీజ్ చేసారు. అనంతరం డ్రైవర్ తో పాటు కారులో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Also :నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు.. రీజన్ ఇదే