కుత్బుల్లాపూర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌

  • Published By: murthy ,Published On : July 20, 2020 / 12:18 PM IST
కుత్బుల్లాపూర్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌

Updated On : July 20, 2020 / 2:23 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు తాకిన సెగ ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ను తాకింది.

ఆయనకు కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వివేకాందతో పాటు ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్లడించారు.

వారందరూ14 రోజుల పాటు తమ ఇంట్లోనే వేరు వేరు గదుల్లో హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందనున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగిన వారందరికీ అధికారులు కోవిడ్ టెస్టులు చేయనున్నారు.