తిరుమలలో మళ్లీ కాషన్ డిపాజిట్ విధానం : అద్దె గదుల బుకింగ్‌కు అడ్వాన్స్‌ 

తిరుమలలో కొత్త ఏడాది నుంచి పాత విధానం మళ్లీ అమలు కాబోతోంది. అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలు చేయడాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది.

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 07:53 AM IST
తిరుమలలో మళ్లీ కాషన్ డిపాజిట్ విధానం : అద్దె గదుల బుకింగ్‌కు అడ్వాన్స్‌ 

Updated On : December 15, 2019 / 7:53 AM IST

తిరుమలలో కొత్త ఏడాది నుంచి పాత విధానం మళ్లీ అమలు కాబోతోంది. అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలు చేయడాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది.

తిరుమలలో కొత్త ఏడాది నుంచి పాత విధానం మళ్లీ అమలు కాబోతోంది. అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలు చేయడాన్ని తిరిగి ప్రారంభించనుంది టీటీడీ. మూడేళ్ల క్రితం కాషన్ డిపాజిట్‌ను రద్దు చేయడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఈ విధానాన్ని తిరిగి ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుండి అద్దె గదులకు డిపాజిట్ వసూలు చేయబోతోంది.

తిరుమలలో మొత్తం 7వేల 500 అద్దె గదులున్నాయి. ఆ గదులకు దశాబ్దాల క్రితం నుండే అద్దెకు సమానంగా కాషన్ డిపాజిట్ కూడా కట్టించుకునేది టీటీడీ. డిపాజిట్ కడితేనే భక్తులకు గదులను అలాట్ చేసేది. గదులు ఖాళీ చేసినపుడు డిపాజిట్ సొమ్మును తిరిగి చెల్లించేది. అయితే మూడేళ్ల క్రితం అప్పటి  టీటీడీ ఈవో సాంబశివరావు ఈ విధానాన్ని రద్దు చేశారు. అప్పటి నుంచి భక్తులు కేవలం గదుల అద్దెను మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో టీటీడీకి సమస్యలు తలెత్తాయి.

24 గంటలకు మాత్రమే అద్దె చెల్లించి గదుల్లో దిగుతున్న భక్తులు… ఆ గడువు దాటాక గదులు వినియోగించుకుంటున్నా అద్దె చెల్లించడంలేదు. చెప్పకుండా గదులు ఖాళీచేసి వెళ్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో… దానికి పరిష్కారంగా అద్దె గదులకు కాషన్ డిపాజిట్ వసూలును తిరిగి అమలు చేయాలని నిర్ణయించారు. దీనిపై సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కాషన్ డిపాజిట్ సొమ్మును భక్తులకు తిరిగిచ్చేందుకు ప్రత్యేకంగా కొన్ని కౌంటర్లను నిర్వహించేది టీటీడీ. అయితే… ప్రస్తుతం భక్తులు రూమ్ బుక్ చేసుకునే సందర్భంలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ స్వైపింగ్‌ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. కాషన్ డిపాజిట్ కూడా అదే విధానంలో తీసుకుంటే తిరిగి చెల్లించేటపుడు సమస్యలుండవని, నేరుగా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయవచ్చని యోచించిన టీటీడీ… కాషన్ డిపాజిట్ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.