వారం డెడ్ లైన్ : చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాల్సిందే

గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత బాబు నివాసానికి మరోసారి CRDA అధికారులు నోటీసులు అంటించారు. ఈ భవనం అక్రమ కట్టడం అని తేల్చిన సంగతి తెలిసిందే. భవనంలోని అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని, లేనిపక్షంలో తామే వాటిని తొలగిస్తామని వెల్లడించింది. ఈ మేరకు భవన యజమాని లింగమనేని రమేశ్‌కు సీఆర్డీఏ నోటీసు జారీ చేసింది.
కృష్ణా నది గరిష్ట వరద నీటి మట్టం లోపల భవనాన్ని వేయి 318 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారని తెలిపింది. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు, స్విమ్మింగ్ పూల్, గ్రౌండ్ ఫ్లోర్‌లో డ్రెస్సింగ్ రూమ్ తదితర నిర్మాణాలను నియమ నిబంధనలు ఉల్లంఘించి కట్టారని తెలిపింది. వీటికి ఎలాంటి అనుమతులు లేవన్న సీఆర్డీఏ..అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదు అంటూ ప్రశ్నించింది. గతంలోనే తాము షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. నిర్దేశిత గడువులోగా సంబంధిత పత్రాలు సమర్పిస్తామని చెప్పి..చేయలేదన్నారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలి..లేనిపక్షంలో తామే వాటిని తొలగిస్తామని నోటీసుల్లో వెల్లడించింది.
Read More : రాయలసీమకు వరదలు : కర్నూలు జిల్లాలో భారీ వర్షం