గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదు ప్రాణాలు తీసిన అతి వేగం

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 05:35 AM IST
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదు ప్రాణాలు తీసిన అతి వేగం

Updated On : February 10, 2020 / 5:35 AM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. టాటా ఏస్ – ఆటో ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లుతెలిపారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని, పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన వారిని తక్షణమే మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తును కొనసాగిస్తున్నారు.