ఒకే కుటుంబంలో ముగ్గురుని కాటేసిన పాము : ఒకరి మృతి

  • Published By: chvmurthy ,Published On : August 24, 2019 / 09:46 AM IST
ఒకే కుటుంబంలో ముగ్గురుని కాటేసిన పాము : ఒకరి మృతి

Updated On : August 24, 2019 / 9:46 AM IST

మహబూబాబాద్ : పాము.. పగ పట్టి కాటేసింది అంటుంటారు..కొన్ని సందర్భాల్లో.. మరి ఈ పాము పగ పట్టిందో లేదో తెలియదు కానీ ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసి వారు కుటుంబాల్లో విషాదాన్నినింపి తాను మరణించింది.

వివరాల్లోకి వెళితే ….మహబూబా బాద్ జిల్లా నర్సింహుల పేట మండలంయర్రచక్రుతండాకు చెందిన జాతోటు రవి(45)..భార్య నీల, కుమారులు శరణ్‌, సాయి, కుమార్తె శైలజ ఒకే మంచంపై నిద్రిస్తున్నారు. ఆగస్టు23, శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన  నూనె కట్ల పాము మొదట రవిని, తర్వాత నీల ను, శరణ్ ను కాటేసింది. ఏదో కుట్టిందని లేచి చూసే సరికి రవికి పాము కనపడింది.  వెంటనే కర్రతో కొట్టి పామును చంపేశారు. 

వెంటేనే గ్రామంలోని  మంత్రగాడి వద్దకు వెళ్లి వైద్యం చేయించుకున్నారు. పరిస్ధితి విషమించటంతో వారి బంధువులు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి మరణించగా నీల, శరణ్ పరిస్ధితి విషమమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో వీరిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.