అరెస్ట్ చేసినా..అండమాన్‌కు పంపించినా భయపడేది లేదు..తగ్గేది లేదు

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 07:58 AM IST
అరెస్ట్ చేసినా..అండమాన్‌కు పంపించినా భయపడేది లేదు..తగ్గేది లేదు

Updated On : December 31, 2019 / 7:58 AM IST

అరెస్ట్ చేసినా..అండమాన్ కు పంపించినా రైతులకు అండగా ఉంటామని వెనక్కి తగ్గేది లేదని టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టంచేశారు. ‘సేవ్ ఏపీ.. సేవ్ అమరావతి’ పేరుతో టీడీపీ నేత..మాజీ మంత్రి దేవినేని ఉమ ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతి రైతులకు మద్దతుగా దేవినేని ఉమ మంగళవారం (డిసెంబర్ 31) ఉదయం 11గంటలక దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష రేపు అంటే జనవరి ఉదయం 11గంటల వరకూ కొనసాగుతుంది.

ఈ సందర్బంగా దేవినేని మాట్లాడుతూ..అమరావతి రైతులకు అండగా ఉంటామని..రైతుల కోసం తాము న్యాయబద్దంగా పోరాడుతుంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారనీ..తమను అరెస్ట్ చేసినా..అండమాన్ కు పంపినా తాము నిరసనలు మానేది లేదని..రైతులకు భరోసాగా ఉండటంతో వెనక్కి తగ్గేది లేదని స్పష్టంచేశారు.  
రైతులు గత 14 రోజుల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటంలేదని..రాజధాని కోసం భూములిచ్చి రైతుల్ని అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.  రాజధాని కోసం భూములిచ్చిన రైతుల్ని అరెస్ట్ లు చేయటం దారుణమన్నారు. వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారనీ..ఇది వైసీపీ ప్రభుత్వం నిరకుంశత్వానికి నిదర్శమని విమర్శించారు.  
 
రాజధానిగా అమరావతని అభివృద్ది చేస్తారని చంద్రబాబుని రైతులు నమ్మారని అందుకే తమకు ఆధారమైన 33వేల ఎకరాల పంట భూముల్ని  ఇచ్చారనీ..కానీ ఈనాటి ప్రభుత్వం వారి నమ్మకాన్ని వమ్ము చేసి రాజధానిని తరలించేందుకు కుట్రలు చేసి..రైతుల భవిష్యత్తును అంథకారం చేస్తోందని విమర్శించారు. జీఎన్ రావు కమిటీ పేరుతో ప్రభుత్వం నాటకాలు ఆడిందనీ..అసలు జీఎన్ రావు కమిటీ కనీసం వంద మీటర్లు కూడా తిరగలేదని..10వేల కిలోమీటర్లు తిరిగినట్లుగా తప్పుడు రిపోర్టు ఇచ్చారని విమర్శించారు. జీఎన్ రావు కమిటీ  ఏసీ రూముల్లో కూర్చుని రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిందనీ..అటువంటి రిపోర్టును నమ్మటం..ప్రభుత్వాన్ని నమ్మిని రైతుల్ని అన్యాయం చేయటం వారికి ద్రోహం చేయటం సరికాదని అన్నారు దేవినేని. 

రైతుల దీక్షకు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మద్దతు తెలిపాయి. ఏపీ రాజధానిగా అమరావతి ప్రకటన వచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజధానిలో ఉద్యమం అణిచివేతకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాజధానిపై కమిటీకి ప్రాధన్యత లేదని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు రాజధానులు లేవని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రాజధాని ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడుతున్నారని దేవినేని ఉమా ఆరోపించారు.

విశాఖకు రాజధానిని తరలించాలనే యోచన సీఎం జగన్ ప్రభుత్వానికి గతంలోనే ఉందని అందుకే విశాఖలో పరిధిలో 10వేల ఎకరాలు గత 6 నెలల్లోనే చేతులు మారాయని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదన..అమలు తెలివితక్కువతనమనీ..రాజధానిగా  అమరావతిని మారిస్తే ఊస్తూ ఊరుకోబోమని దేవినేని ఉమ హెచ్చరించారు.