కోల్‌కతా ప్లేయర్‌కు గంగూలీ వార్నింగ్

కోల్‌కతా ప్లేయర్‌కు గంగూలీ వార్నింగ్

Updated On : March 30, 2019 / 11:31 AM IST

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ధావన్‌కు సలహాలివ్వడంతో పాటు కోల్‌కతా జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు నెట్స్‌లో ధావన్ తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. ఢిల్లీ ముఖ్య సలహాదారుగా ఉన్న గంగూలీ ప్లేయర్లకు సూచనలిచ్చాడు. ఈ మేర ధావన్ ను బేసిక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇచ్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ కు చిన్న వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆండ్రీ రస్సెల్ ఫామ్ లో ఉన్న మాట వాస్తవమే. దాంతోపాటు ఢిల్లీ బౌలర్లు అతణ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. జట్టులో కచ్చితంగా ఒకరు రస్సెల్ వికెట్‌ను పడగొడతారని తెలిపాడు. 

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా శనివారం మార్చి 30న సొంతగడ్డపై ఢిల్లీ.. కోల్‌కతాపై తలపడనుంది. 2 వరుస విజయాల తర్వాత ఢిల్లీని పడగొట్టాలని కోల్‌కతా ఆశగా ఎదురుచూస్తోంది.