విద్యార్థులా.. వీధి రౌడీలా : నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 08:02 AM IST
విద్యార్థులా.. వీధి రౌడీలా : నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు

Updated On : February 29, 2020 / 8:02 AM IST

స్టూడెంట్స్ వీధి రౌడీళ్లా మారారు…నడి రోడ్డుపై ఘర్షణకు దిగి నానా రచ్చే చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని తమ్మినాయుడు కాలేజీకి చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు…ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థి బైక్ తో సెకండ్ ఇయర్ విద్యార్థిని ఢీకొట్టడంతో ఈ గొడవ స్టార్ట్ అయింది. అది చిలికి చిలికి గాలివానగా మారి గ్రూప్ వార్ కు దారి తీసింది. 

అయితే ఈ కొట్లాట పాలకొండ పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో చోటు చేసుకున్నా.. పోలీసులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. సుమారు గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయినా స్పందించకపోవడం, తమ కాలేజీ విద్యార్థులు వీధి రౌడీళ్ల రోడ్లపై కొట్టుకుంటున్నా.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read | పాపం పసివాళ్లు : గోడసందులో ఇరుక్కున్నారు