కోడిపుంజు పెట్టిన చిచ్చు..పక్కింటి వ్యక్తి హత్య

తమిళనాడులో ఇరుగు పొరుగు వారి మధ్య ఓ కోడిపుంజు పెట్టిన చిచ్చు ఓ వ్యక్తిని హత్య చసేంత వరకూ వెళ్లింది. సోమవారం (జులై20) అన్బలగర్ అనే వ్యక్తికి చెందిన ఓ కోడిపుంజు పక్కనే ఉంటున్న శశికుమార్ అనే వ్యక్తి ఇంటిలోకి వెళ్లింది. వారి ఇంటిలో పెంచుకుంటున్న మొక్కలతో పాటు ఇంటిలో ఇతర వస్తువులను పాడు చేసింది. దీంతో శశికుమార్ భార్యకు చిర్రెత్తుకొచ్చింది. అన్బలగన్ భార్యతో గొడవపెట్టుకుంది. అలా ఇద్దరు ఆడవాళ్ల మధ్యా జరిగిన గొడవలో ఇంటి మగవాళ్లు కూడా జోక్యం చేసుకున్నారు.
ఈ గొడవ కాస్తా మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఘర్షణలో భాగంగా అన్బలగర్ ఓ రాయి తీసుకుని శశికుమార్ పై దాడిచేశాడు. ఈ దాడిలో గాయపడిన శశికుమార్ కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే భార్య ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో శశికుమార్ భార్య అన్బలగర్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా అన్బలగర్ తో పాటు అతని భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా ధర్మాసనం వారికి జ్యుడిషియల్ కష్టడీకి అప్పగించారు.