టీడీపీ నాకు అన్యాయం చేసింది: వైసీపీలో చేరిన తోట దంపతులు

అమరావతి : టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీ తోట నరసింహం దంపతులు. తోట నరసింహం దంపతుల్ని వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతు..పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పనిచేసిన తనకు టీడీపీ తనకు చాలా అన్యాయం చేసిందనీ..వాపోయారు.
ఈ క్రమంలో తనకు ఉన్న అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయనని..తన భార్యకు కాకినాడు ఎమ్మెల్యే టిక్కె్ట్ ఇవ్వాలని తోట నరసింహం టీడీపీ అధినేత చంద్రబాబును కోరిన క్రమంలో చంద్రబాబు దానికి అంగీకరించకపోవటంతో మనస్తాపానికి గురైన తోట భార్య వాణి, కుమారుడితో కలిసి వైసీపీలో చేరామని తెలిపారు.
Read Also : ఎందుకిలా : వైసీపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ వాయిదా
2004లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగాను..తరువాత 2019తో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తోట తరువాత టీడీపీలో చేరారు. పలు అనారోగ్య కారణాలతో తనకు ప్రజా జీవితంలో కొనసాగలేననే కారణంతో తన భార్య వాణికి జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుని కోరారు. అయితే అక్కడ టిక్కెట్ ఇవ్వలేమని..ఎన్నికలు పూర్తయ్యాక నరసింహానికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో టీడీపీ తమను అవమానించిందని భావిస్తున్న తోట దంపతులు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తోట వాణి కాకినాడ సిటీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.