నోరు మూయించే పథకం : నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసేశారు  

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 09:55 AM IST
నోరు మూయించే పథకం : నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసేశారు  

Updated On : November 19, 2019 / 9:55 AM IST

ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి విమర్శలు కురిపించారు. నవ రత్నాల పేరుతో నవ రంధ్రాలు మూసి వేశారని ఎద్దేవా చేశారు. ఎవ్వరూ మాట్లాడకూడదని నోరు మూయించే అందరి నోరు మూయించే పథకాన్ని తీసుకొచ్చి ప్రజలను మోసం చేస్తున్నాని మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు గిట్టు బాటు ధర కల్పించలేకపోతోందనీ..రైతు భరోసాను అమలు చేయకుండా రైతుల నడ్డి విరిచేస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం దగ్గర  రైతులకు సంబంధించి  పూర్తి సమాచారమే లేదన్నారు. మాజీ సీఎం చంద్రబాబుని తిట్టించటమనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చారనీ మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. చెప్పే మాటలకూ చేసే పనులకు సంబంధం లేదని జగన్ ప్రభుత్వం పై టీడీపీ నేత ఆలపాటి రాజా మండిపడ్డారు.