కేసీఆర్ కు ఆంధ్రాలో ఏం పని ? : టీడీపీ ఎంపీ కనకమేడల
ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.

ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
అమరావతి: ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ చాలని, ఆయన హామీలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన కోరికే వైసీపీ పుట్టుకకు కారణం తప్ప, ఆ పార్టీకి సిద్దాంతాలు ఏమీ లేవని ఎంపీ చెప్పారు. వైఎస్ మరణానికి జగన్, విజయమ్మ కారణమని కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడు బోత్స సత్యనారాయణ చెప్పారని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తారని మోడీని నమ్మి మోసపోయాం అని కనకమేడల అన్నారు. ఒక పధకం ప్రకారమే ఆంధ్రప్రదేశ్ పై కుట్ర జరుగుతోందని, ముఖ్యమంత్రి కావడానికి, కేసుల నుండి బయట పడేందుకు జగన్ 5 కోట్ల ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారని ఆరోపించారు.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం
పోలవరానికి అనుకూలం అని చెప్పిన కేసిఆర్, ఫిబ్రవరిలో పోలవరం ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసు వెనక్కి తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు ? తెలంగాణ ప్రభుత్వం నుండి కోర్టులో వేసిన పిటీషన్లు అన్నీ వెనక్కి తీసుకున్న తర్వాత కేసిఆర్ పోలవరం గురించి మాట్లాడాలని ఆయన కోరారు. మోడీ డైరెక్షన్ లో కేసిఆర్, జగన్ పని చేస్తున్నారని, జలవనరులకి ప్రధానమైన నదుల అనుసంధానం, పోలవరం, పట్టిసీమ పై జగన్ వైఖరి చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. వైపీసీ పార్టీ పుట్టుక నుండి ఇప్పటి వరకు పరిణామాలు చూస్తే జగన్ కు సీ.ఎం కావాలనే తపన తప్ప ప్రజా ప్రయోజనాలు కనిపించలేదని అన్నారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను