టీడీపీకి దొరికిన అస్త్రం.. ఐటీ పంచనామా.. వైసీపీపై ఎదురుదాడి

  • Published By: vamsi ,Published On : February 16, 2020 / 07:26 AM IST
టీడీపీకి దొరికిన అస్త్రం.. ఐటీ పంచనామా.. వైసీపీపై ఎదురుదాడి

Updated On : February 16, 2020 / 7:26 AM IST

చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో రూ. 2వేల కోట్లు దొరికిందంటూ.. వచ్చిన వార్తలతో రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య వాదనలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో  రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఐటీ రైడ్స్ అంశానికి సంబంధించిన కీలక ఆధారాలు బయటకు వచ్చాయి.

రెండు వేల కోట్ల రూపాయలు భారీ ఆస్తులు టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో లభ్యమయ్యాయని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. అక్కడ దొరికింది కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం అని ఐటీ పంచనామాలో వెల్లడైంది. సోదాల్లో లభ్యమైన బంగారు ఆభరణాలను సీజ్ చేయలేదని కూడా ఐటీ అధికారులు అందులో స్పష్టం చేశారు. పంచనామా నివేదికపై శ్రీనివాస్‌, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన దాడులు గురించి పంచనామాలో క్లియర్‌గా ఉంది. 

ఈ పంచనామా నివేదిక బయటకు రావడంతో ఒక్కసారిగా టీడీపీ వైసీపీపై రాజకీయ ఎదురుదాడిని మొదలుపెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది టీడీపీ. ఈ విషయమై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్పతో సహా  ట్విట్టర్ వేదికగా వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “తప్పుడు ప్రచారం అని ముందే చెప్పాము. ఇదిగో, ఈ రోజు ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా సాక్ష్యం అంటూ ట్వీట్ చేశారు.