కర్నూలులో ఉద్రిక్తత : వైసీపీ ప్రచారాన్ని అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు
ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు.

ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు.
కర్నూలు : ఏపీలో ఎన్నికల వేళ ప్రాంతీయ పార్టీలు జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులే గడువు ఉండటంతో రాజకీయ నేతలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారంలో దూకుడు పెంచేశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాగ్రామాన నేతలు ప్రచారం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో మంగళవారం (ఏప్రిల్ 9, 2019) ఉద్రిక్తత నెలకొంది.
వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు తమ గ్రామంలోకి రావద్దంటూ టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేత శ్రీదేవిని తమ గ్రామంలో ప్రచారం చేయకుండా టీడీపీ కార్యకర్తలు వెనక్కి పంపేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు పోలీసుల వెంటపడి గ్రామం నుంచి తరిమికొట్టారు.
Read Also : బీఫ్ అమ్ముతున్నావా? పంది మాంసం తినాలని చావగొట్టారు