పదవి కోసం : ఏకంగా మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన మహిళా టీచర్
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్.. పోస్టు కోసం అడ్డదారి తొక్కింది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కైంది. వాళ్లు వీళ్ల సంతకాలు ఫోర్జరీ చేస్తే కిక్

పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్.. పోస్టు కోసం అడ్డదారి తొక్కింది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కైంది. వాళ్లు వీళ్ల సంతకాలు ఫోర్జరీ చేస్తే కిక్
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్.. పోస్టు కోసం అడ్డదారి తొక్కింది. మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కైంది. వాళ్లు వీళ్ల సంతకాలు ఫోర్జరీ చేస్తే కిక్ ఏముంటుంది అని అనుకుందో ఏమో.. ఏకంగా ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ సంతకాన్నే ఫోర్జరీ చేసింది. కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన సదరు ఉపాధ్యాయురాలు.. తనకు నచ్చిన పోస్ట్ లో ఎంచక్కా జాబ్ కూడా చేసుకుంటుంది. ఇదే ఇప్పుడు నల్గొండ జిల్లాలో సెన్సేషన్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా రావులపెంట జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తోంది మనావత్ మంగళ. దీంతోపాటు.. ఓపెన్ స్కూల్స్ జిల్లా ఇంచార్జ్ కో ఆర్డినేటర్‌గా కూడా మంగళ వ్యవహరిస్తోంది. ఆరోపణలు రావడంతో.. మంగళను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక్కడే ఆమె చాలా చాకచక్యంగా వ్యవహరించింది. తనకు మంత్రి కేటీఆర్ మద్దతు ఉందని నిరూపించుకునే ప్రయత్నంలో.. మళ్లీ తనని అదే పోస్ట్‌లో కేటీఆర్ నియమించారని చెబుతూ.. అందుకు తగ్గట్లుగా ఒక లెటర్‌ని క్రియేట్ చేసింది. అందులే మంత్రి కేటీఆర్ సంతకాన్ని కూడా ఫోర్జీరీ చేసేసింది. ఇంత చిన్న పోస్ట్‌కే కేటీఆర్ లెటర్ తెప్పించుకుందని ఉద్దేశంతో ఉన్నతాధికారులు కూడా నమ్మేశారు.
రెండు వారాల తర్వాత.. మనావత్ మంగళకు నిజంగా కేటీఆర్‌తో లెటర్ ఇప్పించుకునేంత సీన్ ఉందా అనే అనుమానం వచ్చింది అధికారులకు. అలా అనుమానం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. అవినీతి పరులను కేటీఆర్ దగ్గరకు కూడా రానివ్వరు. అసలు అవినీతి అనేదానినే ఆయన సహించరు. అలాంటిది మనావత్ మంగళకు తిరిగి పోస్ట్‌లో స్థానం కల్పిస్తూ లెటర్ ఎలా ఇస్తారు అని భావించి ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది.
ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మంగళ కేటీఆర్ పేరుతో లెటర్ ఫోర్జరీ అని తెలిసినా ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కారణం.. మనావత్ మంగళ.. ఒక ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర నాయకురాలిగా ఉంది. దీంతో.. ఆమెను టచ్ చేసేందుకు కూడా ఉన్నతాధికారులు భయపడుతున్నారని వార్తలు విన్పిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే మంత్రి పేషీ అంతర్గత విచారణ కూడా చేపట్టింది. అయినా మనావత్ మంగళ అదే పోస్టులో కొనసాగుతుండటం విశేషం.