స్కూల్లోనే విద్యార్ధులతో టిక్ టాక్ వీడియోలు చేయిస్తున్న టీచర్ల

స్కూల్లో టీచర్లు ఏం చేయాలి? పాఠాలు చెప్పాలి. పాఠాలతో పాటు మంచి మాటలు చెప్పాలి. కానీ ఓ స్కూల్లో మాత్రం టీచర్లు విద్యార్ధులకు విద్యాబుద్ధులు చెప్పటం పక్కనపెట్టేశారు. మరి ఏం చేస్తున్నారో తెలుసా? గానా బజానా మొదలుపెట్టారు. విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్స్‌లోనే పాటలు పాడుతూ.. డాన్స్‌లు చేస్తూ.. టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తున్నారు. స్కూల్‌ని టిక్ టాక్ సెంటర్‌గా మార్చేసిన ఘటన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరం గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఈ విషయం తెలిసిన ఉన్నతాధికారులు టీచర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. టీచర్ల పరువు తీస్తున్నారంటూ మండిపడ్డారు. అనంతరం సస్పెండ్ చేశారు. ముగ్గురు కాంట్రాక్ట్ టీచర్లు కొన్ని రోజులుగా విద్యార్ధులతో స్కూల్లో టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. తాము చేయడమే గాక విద్యార్థులతో కూడా చేయిస్తున్నారు. అంతేకాదు విద్యార్థులతో రొట్టెలు చేయించడం, విద్యార్థినులతో సినిమాల్లోని డైలాగ్‌లు చెప్పించుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వారితో సినిమా పాటలు పాడించడం వంటివి చేయించి టిక్ టాక్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
ఆ వీడియోలు వైరల్ కావడంతో వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ బుర్హాన్ రామవరం గురుకుల స్కూల్లో విచారణ చేపట్టగా ఆ విషయం నిజమేనని తేలింది. దీంతో సదరు టీచర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనిపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తూ సదు టీచర్లను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.