పోలీసు కేసు నమోదయిందన్న భయంతో యువకుడు ఆత్మహత్య
వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.

వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఏటీఎంల ధ్వంసం ఘటనలో పోలీసులకు విచారణ చేపట్టారు. అశ్వారావుపేటకు చెందిన కొంతమంది యువకులు ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేసినట్లు అనుమానం రావడంతో పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టారు.
అయితే ఏటీఎంను అశోక్ అనే యువకుడు ధ్వంసం చేసినట్లుగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు. ఏటీఎం ధ్వంసం చేసిన సమయంలో అశోక్ తోపాటు ఉన్న యువకులపై కూడా కేసు నమోదైనట్లు భావించిన కళ్యాణ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కాగా కళ్యాణ్ ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులే కారణమని మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కళ్యాణపై కూడా కేసు నమోదైనట్లు భయభ్రాంతులకు గురి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి తల్లి, కుటుంబీకులు అశ్వారావుపేట ఆస్పత్రి దగ్గర ఆందోళన చేపట్టారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు.
అయితే పోలీసు శాఖ అధికారులు మాత్రం ఏటీఎం ధ్వంసం చేసిన ఘటనలో అశోక్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏటీఎం ధ్వంసం చేసిన సమయంలో అశోక్ తోపాటు కళ్యాణ్ అనే యువకుడు కూడా ఉండడంతో విచారణలో భాగంగా అతన్ని పోలీసు స్టేషన్ కు పిలిపించామని తెలిపారు. ఏటీఎం ధ్వంసం కేసులో కళ్యాణ్ ను విట్ నెస్ గా మాత్రమే చేర్చామన్నారు. అయితే తనపై కూడా కేసు నమోదైందని అపోహలకు లోనైన కళ్యాణ్.. ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read : రిపోర్టర్ పై కత్తులు, బీరు సీసాలతో దాడి