ఇద్దరు చంద్రుల కలలు చెదిరిపోతాయ్ – లక్ష్మణ్

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 10:07 AM IST
ఇద్దరు చంద్రుల కలలు చెదిరిపోతాయ్ – లక్ష్మణ్

Updated On : May 12, 2019 / 10:07 AM IST

మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. ఇద్దరు చంద్రుల కలలు వమ్ముకావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు తావు లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. అన్నీంటా నియంతృత్వం సాగుతుందన్నారు.

మే 12వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో త్రిసభ్య కమిటీ స్పష్టంగా గ్లోబరీనా సంస్థ వైఫల్యాన్ని ఎత్తిచూపినా.. ప్రభుత్వం ఆ సంస్థపై చర్య తీసుకోలేకపోతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ విమర్శించారు. ఆ సంస్థపై ప్రభుత్వానికి ఎందుకు అంత మమకారం ఉందో తెలియడం లేదన్నారు. విద్యాశాఖమంత్రిని బర్తరఫ్ చేసేంతవరకు.. బాధిత విద్యార్థి కుటుంబాలకు నష్టపరిహారం అందించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని లక్ష్మణ్ చెప్పారు.