మహబూబ్ నగర్‌లో కిడ్నాప్ కలకలం : ఆటో నుంచి దూకి తప్పించుకున్న బాలిక

బాలికలపై పెరుగుతున్న అరాచాలకు అంతు లేకుండా పోతోంది. కిడ్నాప్‌లు..అత్యాచారాలు, వేధింపులు..హత్యలు ఇలా బాలికలపై పెరుగుతున్న హింసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ అమన్ గల్ లో బాలికను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యువకులు యత్నించటం స్థానికంగా కలకలం రేపింది. జరిగిన ఈ ఘటనతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు స్థానికులు. తల్లకుంటపల్లి నార్లకుంట తండాకు చెందిన 10వ తరగతి చదివే బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసేందుకు బలవంతంగా ఆటో ఎక్కించారు. దీంతో అప్రమత్తమైన సదరు బాలిక ఆటోలో నుంచి దూకి తప్పించుకుంది. వెంటనే స్థానికులకు సమాచారం అందించగా వెంటనే స్పందిచిన వారు ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
కాగా గురువారం (సెప్టెంబర్ 12)న స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలిక ఆటో కోసం ఎదురు చూస్తోంది. దీన్ని గమనించిన ఇద్దరు యువకులు ఆటో వచ్చి బాలికను ఎక్కించుకున్నారు. తరువాత బాలికతో సదరు యువకులిద్దరు అసభ్యంగా ప్రవర్తించటంతో వెంటనే అనుమానం వచ్చి అప్రమత్తమైన బాలిక ఆటోలో నుంచి దూకేసింది. స్పీడ్ గా వెళుతున్న ఆటోనుంచి దూకేయటంతో బాలికకు గాయాలయ్యాయి. బాలిక కేకలతో స్థానికులు వెంటనే స్పందించారు.
పరుగు పరుగున వచ్చి.. ఏం జరిగిందని అడగటంతో ఇదీ సంగతి అని చెప్పింది. దీంతో ఆటోను వెంబడించి నిందితులిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు యువకులిద్దరితో పాటు ఆటో డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా..ఇద్దరు యువకులలతో ఒకరు హైదరాబాద్ కు చెందిన షరీఫ్ గా గుర్తించారు. షరీష్ మరో యువకుడు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారనీ..ఒంటరిగా వెళ్లే మహిళలను..యువతులను వేధించటం..వీలైతే వారిని కిడ్నాప్ చేస్తుంటారని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ గతంలో ఎటువంటి నేరాలకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.