రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి.. ప్రయారిటీ వాటికే ఇవ్వాలి: ఉండవల్లి

  • Published By: vamsi ,Published On : February 6, 2020 / 07:58 AM IST
రాజధాని ఎక్కడైనా పెట్టుకోండి.. ప్రయారిటీ వాటికే ఇవ్వాలి: ఉండవల్లి

Updated On : February 6, 2020 / 7:58 AM IST

క్యాపిటల్ ఎక్కడైనా పెట్టుకోండి దాని వల్ల ఉపయోగం ఏంటీ? అని ప్రశ్నించారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం నిర్ణయంపై తాను ఏమీ చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఒకచోట, సెక్రటేరియేట్ ఒకచోట దేశంలో ఎక్కడా లేవని అన్నారు. రాజధాని అంశం కంటే పోలవరం, ప్రత్యేకహోదాకు జగన్ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

క్యాపిటల్ వల్ల వచ్చేదేంటీ? కారులో అయినా పెట్టుకోండి.. వెనుక సీటులో కూర్చొని పాలించండి ఏమవుతుంది. ఫస్ట్ ప్రయారిటీ మాత్రం పోలవరం తీసుకుని, పోలవరం పూర్తి చెయ్యాలని అన్నారు. పోలవరంను 2021 జూన్ కి పూర్తి చేస్తామని మంత్రి అన్నారని అది ఇంపాజిబుల్. అయితే దానిని మీ టర్మ్ పూర్తయ్యేలోపు పూర్తి చెయ్యండి. ఇండస్ట్రీలు ప్రకటించండి. సెక్రెటరేట్ పెడితే కంపెనీలు రావని అన్నారు.  

అలాగే అమరావతి రైతులు చేసింది త్యాగం కాదని, రియల్ ఎస్టేట్ లో భాగస్వామ్యమని ఎప్పుడో చెప్పానని అన్నారు. గ్రామ సచివాలయాలు చాలా మంచి కాన్సెప్ట్ అని, జగన్ ప్రభుత్వం పెన్షన్లు తీసివేస్తున్న విధానం మాత్రం సరికాదని అన్నారు. ఇది జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే విషయం అని అన్నారు.