కామాంధులకు బలైపోయిన మరో చిన్నారి..నెలలో ముగ్గురు చిన్నారులపై హత్యాచారాలు..

  • Published By: nagamani ,Published On : September 4, 2020 / 01:10 PM IST
కామాంధులకు బలైపోయిన మరో చిన్నారి..నెలలో ముగ్గురు చిన్నారులపై హత్యాచారాలు..

Updated On : September 4, 2020 / 3:44 PM IST

ఉత్తరప్రదేశ్ అనే మాట వినిపిస్తే చాలు ఏం నేరం జరిగిందో..ఏ చిన్నారి జీవితం ఛిద్రం అయిపోయిందో..ఏ తల్లికి కడుపుకోత..గుండె కోతను రాజేసిందో అనే ఆందోళన నెలకొనే పరిస్థితిగా మారిపోయింది. నేరాలకు అడ్డాగా..ముఖ్యంగా చిన్నారులపై..యువతులపై జరిగే అఘాయిత్యాలు..అత్యాచారాల యూపీగా మారిపోయింది. ఆడబిడ్డల ఉసురుతీసే మారణహోమ స్థలంగా యూపీ మారిపోయింది. ఈక్రమంలో భయపడినట్లుగానే ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో చిన్నారి కామాంధుల దురాగతానికి బలైపోయింది. మూడేళ్ల ముక్కుపచ్చలారని చిన్నారి జీవితం ఛిద్రమైపోయింది.



బుధవారం ( సెప్టెంబర్ 2,2020) నుంచి కనిపించకుండా పోయిన మూడు సంత్సరాల చిన్నారి గురువారం ఉదయంకల్లా చెరుకుతోటలో అత్యాచారానికి గురై చచ్చిపడి ఉంది. ఈ విషయాన్ని శుక్రవారం (3,2020)న పోలీసులు తెలిపారు.బుధవారం నుంచి తమ బిడ్డ కనిపించకుండాపోయిందని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెకోసం గాలించగా..గురువారం చెరుకుతోటలో శవం అయి కనిపించింది.

ఈ దారుణంపై లఖింపూర్ ఎస్పీ సతేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ..ఆ చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. దుండగులు అత్యాచారం చేసి చంపేశారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాగా.. ల ఖింపూర్ లో ఒక నెలలో ముగ్గురు బాలికలపై అత్యాచారాలు జరుగగా వారిని హత్య చేశారని తెలిపారు.



కాగా..లఖింపూర్ ఖేరీ గ్రామంలో కొన్ని రోజుల క్రితం 17 ఏళ్ల బాలిక స్కాలర్ షిప్ కోస అప్లికేషన్ కోసం ఇంటినుంచి బయలుదేరగా ఆమెను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసిన తీసుకెళ్లి అత్యాచారం చేసి.. చంపేశారు. లఖింపూర్ ఖేరీ గ్రామానికి 200ల మీటర్ల దూరం..నీమ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చెరువు వద్ద ఆమె మృతదేహం పడి ఉంది.
https://10tv.in/young-man-molested-minor-girl-in-the-name-of-love-in-setturu/
అలాగే అదే గ్రామానికి చెందిన మరో 13 ఏళ్ల బాలిక పొలానికని వెళ్లింది. కానీ తిరగిరాలేదు. దీంతో కనిపించకుండాపోయిన తమ కూతురి కోసం కుటుంబ సభ్యులు వెతగ్గా వెతగ్గా..ఆమె కూడా చెరుకుతోటలో శవమై కనిపించింది. ఆ బాలిక కూడా అత్యాచారానికి గురై హత్య చేయబడింది.



ఇలా యూపీ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై మారణహోమం జరుగుతోంది. చిన్నారుల జీవితాలు కామాంధులకు బలైపోతున్నాయి. ముక్కుపచ్చలారని పసిబిడ్డలకు దారుణ కామాంధుల ఘాతుకాలని ఛిద్రమైపోతున్నారు. ఇలా లెక్కలోకి రాని..వెలుగులోకి రాని ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి.